త్రివిక్రమ్‌ కథనం, బన్నీ ప్రదర్శనం

త్రివిక్రమ్‌ కథనం, బన్నీ ప్రదర్శనం
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివక్రమ్ మరోకసారి జత కట్టారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది . ఐతే, భారత స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్‌ కథనం, బన్నీ ప్రదర్శనం
Trivkiram,. Allu Arjun

ఇక ఈ మూవీ ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. కాగా డిసెంబర్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాము అని మేకర్స్ చెప్పుకొచ్చారంట . హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమా ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.