@నర్తనశాల సెన్సార్ రివ్యూ…పాడు పిల్లాడు !

nartanasala censor review

‘ఛ‌లో’ మూవీతో క్రేజీ హీరోగా మారిన నాగశౌర్య ఇప్పుడు నర్తనశాల సినిమాతో మననుందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన గే పాత్ర చేస్తున్నాడని తెలుస్తోంది. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ప్రొడక్షన్ నెం 2 గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘నర్తనశాల’ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో హీరోలు డిఫెక్ట్ లతో వచ్చే సినిమాలు హిట్ కావడం, విభిన్న కధాంశాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి హిట్ చేస్తుండడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. దర్శకుడు కృష్ణవంశీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్‌లు హీరోయిన్‌గా నటిస్తున్నారు.

nartanasala

ఈ చిత్రంలో నాగశౌర్య.. గే పాత్రలో పూర్తి స్థాయి వినోదాన్ని పంచనున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ సర్టిఫికెట్ పొంది సెన్సార్ సభ్యుల ప్రశంసలు సైతం అందుకుంది. రెండు గంటల 18 నిమిషాల నిడివితో వినోదభరితమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ‘నర్తనశాల’లో నవ్వుల పువ్వులు ఖాయమేనని అంటూ సెన్సార్ టాక్ . మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అందిచిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గే పాత్రలో నాగాశౌర్య ఏమాత్రం ప్రేక్షకులని అలరించనున్నాడు అనేది రెండ్రోజుల్లో తేలిపోతుంది.

nartanasala