మోహన్‌బాబు చాలా కాలం తర్వాత…!

Mohanbabu Re Entry On Vilan Charactor

మోహన్‌బాబు ఈమద్య కాలంలో సినిమాలు తక్కువ చేస్తున్నాడు. ఈవయస్సులో కూడా మోహన్‌బాబు హీరోగా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన కొడుకులు మరియు కూతురు ముగ్గురు కూడా సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇంకా మోహన్‌బాబుకు హీరో పాత్రలపై మోజు తగ్గలేదా అంటూ కొందరు వెనుక నుండి విమర్శలు చేశారు. మోహన్‌బాబు ఏజ్‌ గ్రూప్‌ నిన్నటి తరం హీరోలు కొందరు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, విలన్‌గా సెటిల్‌ అయ్యారు. జగపతిబాబు గతంలో హీరోగా ఎన్నో సక్సెస్‌లను దక్కించుకుని, ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెల్సిందే. అదే దారిలో మోహన్‌బాబు నడవాలని కొందరు కోరుకుంటున్నారు. కాని మోహన్‌బాబును విలన్‌ పాత్రకు అడిగేంత సాహసం ఎవరు చేయడం లేదు.

mohanbabu movies

కెరీర్‌ ఆరంభంలో మోహన్‌బాబు విలన్‌ పాత్రను ఎక్కువగా చేశాడు. చిరంజీవి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో మోహన్‌బాబు విలన్‌గా నటించి మెప్పించాడు. కామెడీ విలన్‌గా కూడా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నవ్వులు పూయించాడు. మళ్లీ ఇన్నాళ్లకు మోహన్‌బాబు విలన్‌ పాత్రకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. తమిళ స్టార్‌ హీరో సూర్య, తెలుగు దర్శకురాలు సుధ కొంగరల కాంబినేషన్‌లో ఒక ద్వి భాష చిత్రం తెరకెక్కబోతుంది.

mohanbabu new movie

ఆ చిత్రంలో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తే బాగుంటుందని సూర్య భావించాడట. అదే విషయాన్ని మోహన్‌బాబు వద్ద ప్రస్థావించగా దాదాపుగా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. మోహన్‌బాబు కథ నచ్చితే విలన్‌ పాత్రను చేసేందుకు ఓకే అన్నట్లుగా ఉన్నాడు. అందుకే సూర్య చిత్రంలో మోహన్‌బాబు విలన్‌గా రీ ఎంట్రీ ఖాయం అయినట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.