స్మగ్లింగ్ నేపధ్యంలో మహేష్ సుక్కూ సినిమా !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన ‘మహర్షి’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మహేష్ బాబు కోసం అడవి నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా సాగానుందట. రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా తరచుగా జరుగుతూనే ఉంటుంది. దీనిపై రోజుకో వార్త మనం చూస్తుంటాం. ఈ స్మగ్లింగ్ అంశాన్నే నేపథ్యంగా తీసుకొని సుకుమార్ ఈ సినిమా కథను తయారుచేసుకున్నారని అంటున్నారు. ఇంతకుముందు ‘రంగస్థలం’ సినిమా కోసం చరణ్ ను పల్లెటూరిలో తిప్పిన సుకుమార్ ఇప్పుడు మహేష్ బాబుని అడవి ప్రాంతాల్లో తిప్పనున్నాడన్నమాట. ఆలాగే ఈ సినిమాలో మహేష్ ని ఇప్పటి వరకూ చూడనంత రఫ్ గ చూపించడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.