వచ్చే సంక్రాంతికి ఎఫ్ 3 !

సంక్రాంతి అల్లుళ్లుగా ‘F2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు థియేటర్స్‌లో నవ్వులు జల్లు కురిపిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. వినయ విధేయ రామ, కథానాయకుడు, పేటా చిత్రాలతో పోటీ పడుతూ జనవరి 12న విడుదలైన ఈ మూవీ క్లీన్ హిట్‌గా మిగతా చిత్రాలను పక్కకు నెట్టేసింది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ‘F2’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘F2’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘F3’ చిత్రాన్ని సీక్వెల్ తీయబోతున్నట్టు ప్రకటించారు అనిల్ రావిపూడి. అయితే ‘F3’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో మరో హీరోని యాడ్ చేయబోతున్నారట. అభిమానులు నా నుంచి ఆశిస్తున్నట్టుగానే ‘ఎఫ్ 3’ సినిమా ఉంటుంది.

వచ్చే సంక్రాంతికి ఎఫ్ 3 ! - Telugu Bullet

వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లైన్ ను డెవలప్ చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, గన్ మ్యాన్ పాత్రల నిడివి ‘ఎఫ్ 3’లో ఎక్కువగా ఉండేలా చూస్తున్నామని అన్నాడు. అలాగే F3 చిత్రంలో ఫన్ పండించేందుకు ఈసారి రవితేజని కూడా పిలుస్తున్నారట. రవితేజకు కామెడీ టైమింగ్‌ కొట్టిన పిండి కావడంతో పాటు వెంకీతో క’ లిస్తే ప్రేక్షకుల పొట్ట చెక్కల కావడం ఖాయమే. అయితే ‘F2’ చిత్రాన్ని కేవలం సీక్వెల్‌గా మాత్రమే కాకుండా రవితేజ ‘రాజా ది గ్రేట్మూవీకి కొనసాగింపుగా కూడా కథను రెడీ చేస్తున్నారట అనీల్ రావిపూడి. రాజా ది గ్రేట్ లో రవితేజ అంధుడు కావడంతో F3 లోనూ అంధుడిగా కనిపించబోతున్నారట రవితేజ. అయితే F3లో మాస్ రాజా ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.