సమంత ప్రకటన వచ్చింది.. ఇక చైతూ క్లారిటీ రావాలి…!

Samantha Clarity On U Turn Movie Waiting For The Chaitu Movie Clarity

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాని కారణంగా సినిమాను వాయిదా వేయడం జరిగింది. వాయిదా పడ్డ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే అదే రోజున సమంత నటించిన ‘యూటర్న్‌’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. యూటర్న్‌ చిత్ర నిర్మాతలను ఒప్పించి తర్వాత వారంకు వాయిదా వేయించాలని శైలజ రెడ్డి అల్లుడు చిత్ర నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. యూటర్న్‌ చిత్రం ఈనెల 13న రాబోతున్నట్లుగా సమంత పోస్ట్‌ చేసిన కొత్త పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. డేట్‌ పోస్టర్‌ రావడంతో సినిమా విడుదల వాయిదా అనేది లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు.

samantha12

సమంత ‘యూటర్న్‌’ మూవీ క్లారిటీ రావడంతో ప్రస్తుతం నాగచైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సమంతతో పాటు అదే రోజున అంటే సెప్టెంబర్‌ 13న అల్లుడు వస్తాడా లేదంటే సినిమా విడుదల వాయిదా వేస్తారా అనేది చూడాలి. మరో రెండు మూడు రోజుల్లో సినిమా విడుదలపై క్లారిటీ రావాల్సి ఉంది.

samantha123

సెప్టెంబర్‌ 13న విడుదల కావాల్సి అంటే కనీసం రెండు వారాల ముందు అయినా ప్రకటన రావాలి. రెండు వారాలు కూడా ఆ తేదీకి సమయం లేదు. అందుకే హడావుడిగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఆ తర్వాత వారంలో నాగచైతన్య వస్తాడా అనేది చూడాలి.

samantha-1