నేషనల్ అవార్డ్..బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ.!

నేషనల్ అవార్డ్..బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ.!
Cinema News

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన అసలైన పొటెన్షియల్ ని కనబర్చి భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న చిత్రమే “పుష్ప ది రైజ్”. దర్శకుడు సుకుమార్ తో బన్నీ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది కాగా పాన్ ఇండియా వైడ్ గా ఇది సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మరి ఈ మూవీ లో బన్నీ తన మ్యాజికల్ పెర్ఫామెన్స్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లగా ఈ సినిమా లో తన నటనకి గాను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవరికీ రాని జాతీయ పురస్కారం అల్లు అర్జున్ ని వరించింది.

నేషనల్ అవార్డ్..బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ.!
Allu Arjun

మరి ఈ అవార్డు వేడుక నిన్న జరుగగా అక్కడ హాజరయ్యి రాష్ట్రపతి చేతులు మీదగా అవార్డు తీసుకున్న బన్నీ ఆ సమయంలో తన బ్యూటిఫుల్ మూమెంట్స్ పై ఒక పోస్ట్ షేర్ చేసుకున్నాడు. తన భార్య, తల్లిదండ్రులు పిక్స్ షేర్ చేసుకొని నా చుట్టూతా మర్చిపోలేని నా వాళ్ళతో ఇదొక మరపురాని రోజు అని అంటూ షేర్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ చూసిన బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ తమ అభిమాన హీరోకి మరోసారి కంగ్రాట్స్ చెప్తున్నారు.