National Politics: ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్

National Politics: Nitish Kumar as the convener of the India Alliance
National Politics: Nitish Kumar as the convener of the India Alliance

ఇండియా కూటమి కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ను నియమించనున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీల వర్చువల్ సమావేశం ఈ వారంలో జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత నియమకాన్ని నితీష్ కుమార్, లూలూ ప్రసాద్ యాదవ్ లతో కాంగ్రెస్ ఇప్పటికే చర్చించింది.

భారత కూటమిలోనే ఇతర భాగస్వాములను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయం పై నితీష్ కుమార్ నిన్న ఉద్దవ్ ఠాక్రెతో మాట్లాడారు. నితీష్ కుమార్ ను కన్వీనర్ గా నియమించే ఆలోచనకు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతును వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇండియా కూటమి నేతలు డిసెంబర్ 19న నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే కూటమికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను నియమించాలనే ప్రతిపాదనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డిల్లీ సీఎం క్రేజీవాల్ సహా పలువురు నేతలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే సీట్ల పంపకం సహా 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనడానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించారు.