పాజిటివ్‌ టాక్‌… నో కలెక్షన్స్‌

Nayanthara Karthavyam movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయిదు చిత్రాల్లో ప్రేక్షకులు ‘కిర్రాక్‌ పార్టీ’పై అంచనాలు పెట్టుకున్నారు. కాని ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో సినిమా బోరింగ్‌గా అనిపించింది. అదే రోజున విడుదలైన ‘కర్తవ్యం’ సినిమా మాత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకోవడంతో పాటు, మంచి రివ్యూలను దక్కించుకుంది. కాని ఉగాది రోజు కూడా ఆ సినిమాకు పెద్దగా కలెక్షన్స్‌ రాలేదు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే పోటీ ఏమీ లేని ఈ సమయంలో సూపర్‌ కలెక్షన్స్‌ రావాలి. కాని షాకింగ్‌గా కర్తవ్యం సినిమాకు ఏమాత్రం కలెక్షన్స్‌ రావడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా గతంలో పేరు పడ్డ శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. తమిళంలో సక్సెస్‌ అయిన చిత్రం అవ్వడంతో పాటు, నయనతారకు తెలుగులో భారీ క్రేజ్‌ ఉన్న కారణంగా తెలుగులులో మంచి వసూళ్లు సాధించడం ఖాయం అని నిర్మాత భావించి ఎక్కువ మొత్తం పెట్టి రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. కాని నయనతార క్రేజ్‌ పనిచేయలేదు. సినిమాను భారీ ఎత్తున విడుదల చేసినా కూడా మినిమం కలెక్షన్స్‌ రాకపోవడంతో నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయవడం ఖాయం అయ్యింది. నయనతార ఈ చిత్రంలో ఒక పవర్‌ ఫుల్‌ కలెక్టర్‌ పాత్రలో కనిపించింది. సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం వల్లే ఈ చిత్రం బాగున్నా కూడా కలెక్షన్స్‌ రావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది.