బాల‌కృష్ణ సినిమాలో న‌య‌న‌తార హోమ్లీ లుక్‌

nayanthara to do homely character in Balakrishna 102 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో అందాల తార న‌య‌న‌తార ముచ్చ‌ట‌గా మూడో సినిమాలో న‌టిస్తోంది. బాల‌కృష్ణ 102వ సినిమాలో న‌య‌న తార మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ తెలుగులో మాత్రం అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తున్న న‌య‌న‌తార బాల‌కృష్ణ సినిమాలో ఆఫ‌ర్ రాగానే మ‌రో మాట లేకుండా అంగీక‌రించింది.

గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి చేసిన సింహ‌, శ్రీరామ‌రాజ్యం సూప‌ర్ హిట్ల‌య్యాయి. ఈ సినిమా కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుంద‌ని చిత్ర బృందం న‌మ్మ‌కంగా ఉంది. సింహ‌, శ్రీరామ రాజ్యం సినిమాల్లో హోమ్లీ గెట‌ప్ తో క‌నిపించింది న‌య‌న‌తార‌. మ‌రి ఈ సినిమాలో ఆమె గెటప్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు. అయితే సెట్స్‌లో ఆమెతో క‌లిసి దిగిన ఓ ఫోటోను టాలీవుడ్ స్ట‌యిలిస్ట్ నీర‌జా కోన సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోను బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార అభిమానులు షేర్ చేస్తున్నారు.

సింహాలోలానే ఇందులోనూ నయ‌న హోమ్లీ గెట‌ప్ తో క‌నిపిస్తోంది. సినిమాలో న‌య‌న్ గెట‌ప్ ఇదే అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. న‌య‌న్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. త‌న 101వ సినిమా పైసావ‌సూల్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంటూనే 102వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు బాల‌కృష్ణ‌. సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు త‌మిళ అగ్ర‌ద‌ర్శ‌కుడు కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఊరించి ఉసూరుమనిపించిన తాప్సి

అర్జున్‌రెడ్డికి శర్వానంద్‌కు సంబంధం ఏంటి?

నితిన్‌ను ఒప్పించిన ఫ్లాప్‌ డైరెక్టర్‌