ఈ రెండు సినిమాలకు ఇలా కలిసొచ్చింది

Nene Raju Nene Mantri Jaya Janaki Nayaka Get Good Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమా యావరేజ్‌గా ఉన్నా మంచి టైంలో విడుదల చేసినట్లయితే మంచి కలెక్షన్స్‌ వస్తాయి. అంటే పోటీ లేని సమయంలో హాలీడేస్‌ సమయంలో విడుదల అయ్యే సినిమాలు యావరేజ్‌గా ఉన్నాయనే టాక్‌ వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయని గతంలో పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా మరో సారి అదే విషయం నిరూపితం అయ్యింది. అంతకు ముందు వారం విడుదలైన మూడు చిత్రాల్లో ‘లై’ మొదటి వారంలోనే సర్దేసుకోగా ‘జయ జానకి నాయక’ మరియు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకు పోతున్నాయి.

గత వారం విడుదలైన ‘ఆనందోబ్రహ్మా’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆ సినిమా తప్ప మరే సినిమా కూడా విడుదల కాలేదు. ఆ కారణంగా ఆ రెండు సినిమాలు మరో వారం పాటు సందడి చేయడం చూడవచ్చు. మరో వైపు ‘ఫిదా’ కూడా ఇంకా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉంది. జయ జానకి నాయక చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా సినిమాకు ఈ సమయం కలిసి వస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ హీరో సేఫ్‌ జోన్‌లో పడ్డట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిస్తుంది. మరో వారం రోజుల పాటు పోటీ లేదు కనుక ఖచ్చితంగా మంచి లాభాలు రావడం ఖాయం. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం మొదటి నాల్గవ రోజు నుండే లాభాల బాట పట్టింది. ఆ సినిమా పెట్టుబడికి మూడు రెట్ట వసూళ్లు సాధించినట్లుగా చెబుతున్నారు.

నితిన్‌ను ఒప్పించిన ఫ్లాప్‌ డైరెక్టర్‌

అర్జున్‌రెడ్డికి శర్వానంద్‌కు సంబంధం ఏంటి?

ఇందుకే ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ను చూస్తున్నారు