చరణ్‌ కోసం ఎన్టీఆర్‌ను పక్కన పెట్టాడా?

next to ntr for ramcharam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొరటాల శివ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని దాదాపు అందరు స్టార్‌ హీరోలు కోరుకుంటున్నారు. వరుసగా మూడు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్న కొరటాల శివ ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా ‘భరత్‌ అను నేను’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. ఇక ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లుగా కొరటాల శివ ప్రకటించాడు. కొరటాల సన్నిహితుడు ఆ సినిమాను నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రం తర్వాత వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ వెంటనే అంటే వచ్చే సంవత్సరం వేసవి తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల సినిమా ప్రారంభం అవుతుందేమో అని అంతా భావించారు. అయితే తాజాగా చరణ్‌తో మూవీని కొరటాల ప్రకటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా చాలా సంవత్సరాల క్రితం సినిమా తెరకెక్కాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. తాజాగా మరో సారి చరణ్‌ స్వయంగా కొరటాలతో మాట్లాడి సినిమా చేద్దామని చెప్పడంతో కాదనలేక పోయినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందనుకున్న సమయంలో చరణ్‌తో కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. దాంతో ఎన్టీఆర్‌ సినిమాను పక్కకు పెట్టాడా లేక అసలే క్యాన్సిల్‌ అయ్యిందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

మరిన్ని వార్తలు

చిక్కుల్లో పడ్డ శంకరాభరణం తులసి

100 డేస్‌ ఫంక్షన్‌ చేసి మళ్లీ కమిట్‌ చేయించాడు

చరణ్‌ కోసం ఎన్టీఆర్‌ను పక్కన పెట్టాడా? - Telugu Bullet