100 డేస్‌ ఫంక్షన్‌ చేసి మళ్లీ కమిట్‌ చేయించాడు

Nani Commit One More Movie with Dil Raju After Ninnu Kori Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Nani Commit One More Movie with Dil Raju

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నాని పేరు ఖచ్చితంగా ఉంటుంది. స్టార్‌ హీరోలకు సమానంగా నాని ప్రస్తుతం స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్నాయి. మూడు సంవత్సరాలుగా నానికి ఎదురు లేకుండా పోయింది. చేసిన ప్రతి సినిమా సక్సెస్‌ బాట పడుతున్న నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా నానితో సినిమా చేసేందుకు దిల్‌రాజు మాస్టర్‌ ప్లాన్‌ వేసి సక్సెస్‌ అయ్యాడు.

నాని హీరోగా నటించిన ‘నేను లోకల్‌’ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత వెంటనే ‘నిన్ను కోరి’ చిత్రాన్ని చేసిన నాని మళ్లీ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. నానితో మరో సినిమా చేయాలని భావించిన దిల్‌రాజు డైరెక్ట్‌గా డేట్లు అడగకుండా ‘నేను లోకల్‌’ చిత్రం 100 రోజుల వేడుక అంటూ ప్లాన్‌ చేసి, నానిని కాక పట్టి మరోసారి నాని డేట్లు తీసుకున్నాడు. నాని హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో మరో సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభంలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. శతమానంభవతి వంటి చిత్రాన్ని నానితో తెరకెక్కించాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. అందుకు దర్శకుడు కథను కూడా సిద్దం చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. వంద రోజుల వేడుక చేసి నానిని సంతోష పెట్టడంతో నాని వెంటనే దిల్‌రాజుకు డేట్లు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తాలు: