‘నిన్నుకోరి’ సమంత..!

Samantha Rejected Ninnu Kori Movie Herione Chance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Samantha Rejected Ninnu Kori Movie Heroine Chance

నాని, నివేదా థామస్‌ జంటగా తెరకెక్కి తాజాగా విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రంకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. నాని మరో సక్సెస్‌ను ఈ చిత్రంతో దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ఒక మంచి ప్రేమకథ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మించాడు. నాని హీరో అనుకోగానే హీరోయిన్‌గా సమంతను అనుకున్నారట. అయితే కొత్త దర్శకుడు అనే ఉద్దేశ్యంతో కాస్త అనుమానం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. 

ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాత కోన వెంకట్‌ చెప్పుకొచ్చాడు. హీరోయిన్‌ పాత్ర కోసం ఒక స్టార్‌ హీరోయిన్‌ను సంప్రదించాం. కాని కొన్ని కారణాల వల్ల ఆమె ఒప్పుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె కారణాలు ఆమెకు ఉండి ఉంటాయి అని ఆయన అన్నాడు. అయితే ఆ హీరోయిన్‌ ఎవరు అనేది మాత్రం కోన పేర్కొనలేదు. తాజాగా సినిమా విడుదలైన తర్వాత నివేదా థామస్‌ పాత్రలో సమంత అయితే మరింతగా ఆ పాత్రకు బలం చేకూరేది అంటున్నారు. సమంత మాత్రం పలు చిత్రాలు చేస్తున్న కారణంగా సినిమాకు నో చెప్పిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సమంత చేసినా చేయకున్నా సినిమాకు మాత్రం పాజిటివ్‌ టాక్‌ రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు: