MOM… తెలుగు బులెట్ రివ్యూ .

Sridevi MOM Movie Review And Rating In telugu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బ్యాన‌ర్ః మ్యాడ్ ఐ ఫిలింస్‌, థ‌ర్డ్ ఐ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులుః శ్రీదేవి, అద్‌నాన్ సిద్ధిఖీ, స‌జ‌ల్ అలీ, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, అభిమ‌న్యు సింగ్ త‌దిత‌రులు
సంగీతంః ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీః అనే గోస్వామి
ఎడిటింగ్ః మోనిషా ఆర్‌.బ్లాద్వా
నిర్మాత‌లుః బోనీ క‌పూర్‌, సునీల్ మాన్‌చంద్ర‌, న‌రేష్ అగ‌ర్వాల్‌, గౌత‌మ్ జైన్‌, ముకేష్‌
ద‌ర్శ‌కత్వంః ర‌వి ఉద్య‌వ‌ర్‌

దేశమంతటా ఓ స్టార్ హీరోకి ఉన్నంత ఇమేజ్ వున్న నటి శ్రీదేవి. ఆమె చాన్నాళ్ల తర్వాత మళ్ళీ వెండితెర మీద కనిపించిన చిత్రం మామ్. ఈ సినిమా నిర్మాతల్లో ఆమె భర్త బోనీ కపూర్ కూడా ఒకరు. ఈ కథ ఆమె దగ్గరికి వచ్చినప్పుడే బయటి నిర్మాతలు రాకపోతే సొంతంగా అయినా చేద్దామని బోనీ మీద శ్రీదేవి ఒత్తిడి తెచ్చింది. అంతగా శ్రీదేవి ని ఆకట్టుకున్న మామ్ కథ సినిమాగా మారాక ఎలా వచ్చింది? ఆమె నమ్మకం, నిర్ణయం జనానికి కూడా నచ్చాయా ,లేదా ఇప్పుడు చూద్దాం.

కథ…

దేవకి( శ్రీదేవి ) ఓ కాలేజ్ లో బోటనీ లెక్చరర్. ఆమె సబర్వాల్ ( సిద్ధికీ) ని రెండో పెళ్లి చేసుకుంటుంది. తొలి వివాహానికి సబర్వాల్ కి ఆర్య అనే కుమార్తె ఉంటుంది. సవతి కూతురికి దగ్గర కావాలని దేవకి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్య ఆమెని బయటి వ్యక్తిగానే చూస్తుంటుంది. అదే సమయంలో ఓ నలుగురు కుర్రవాళ్ళు కారులో ఆర్యని రేప్ చేస్తారు. దాంతో ఆ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు ఎదురు అవుతాయి. కేసు కోర్టు దాకా వెళ్లినా నిలబడదు. అప్పుడు దేవకి ఏ నిర్ణయం తీసుకుంటుంది?. ఆర్యకి అండగా నిలబడేందుకు తీసుకున్న నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుంది?. అమ్మాకూతుళ్ల మధ్య అనుబంధం ఏర్పడుతుందా ?. ఈ ప్రశ్నలకు సమాధానమే మామ్ సినిమా.

విశ్లేషణ…

శ్రీదేవి మోహంలో వయసు మీద పడుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కానీ ఆమె నటనలో అంతకంతకు పరిణితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని రుజువు చేసిన సినిమా మామ్. కూతురికి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు శ్రీదేవి నటన చూసి తీరాల్సిందే. ఇక క్లైమాక్స్ సన్నివేశంలో విలన్ ఢికొట్టే సీన్ శ్రీదేవి నటనకు పరాకాష్ట. శ్రీదేవితో పాటు నవాజుద్దీన్ సిద్దికీ, సజల్ అలీ తమ పాత్రలు బాగా చేశారు. కధలో నేటి సమాజ ధోరణి చెప్పేందుకు దర్శకుడు రవి వుద్యోవర్ అమ్మ దృక్కోణాన్ని ఎంచుకున్నాడు. ఇక కథ లో చెప్పదలుచుకున్న విషయాన్ని భావోద్వేగాలతో బాగా రక్తి కట్టించాడు. అయితే కధలో భావోద్వేగాలకు పెద్ద పీట వేసినంతగా మలుపులుకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కధనం ఫ్లాట్ అయినట్టు అనిపిస్తుంది. మొదటి అర్ధ గంటలోనే మనం ఏ రకమైన సినిమా చూడబోతున్నామో అర్ధం అవుతుంది. తెలిసినట్టు అనిపించినా శ్రేదేవి నటన,దర్శకుడు రవి వుద్యోవర్ పనితనం మిమ్మల్ని ఆలా కూర్చోబెట్టేస్తాయి. అయితే సినిమా లెంగ్త్ తగ్గితే బాగుండేది.

సాంకేతిక నిపుణులు…

ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, సంగీతం హైలైట్. గోస్వామి ఫోటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచితే, రెహ్మాన్ నేపధ్య సంగీతం సినిమాలో భావోద్వేగాల్ని రెట్టింపు చేసింది. ఎడిటింగ్ పర్లేదు అనిపిస్తుంది. మిగిలిన విభాగాలు కూడా బాగానే అనిపిస్తాయి.

తెలుగు బులెట్ పంచ్ లైన్… మామ్ ని శ్రీదేవి కోసం చూడొచ్చు.
తెలుగు బులెట్ రేటింగ్2 . 75 /5 .