కళ్యాణితో అఖిల్‌ రొమాన్స్‌

Priyadarshan's Daughter Kalyani To Debut In Acting With Akhil Akkineni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Priyadarshan’s Daughter Kalyani To Debut In Acting With Akhil Akkineni

అక్కినేని అఖిల్‌ రెండవ సినిమా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో అఖిల్‌ దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. ఇంకా కూడా హీరోయిన్‌పై క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌ ఎంపిక పూర్తి అయినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

అఖిల్‌కు జోడీగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కళ్యాణిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈమె దర్శకత్వంలో రాణించాలని కోరుకుంటుంది. ఇప్పటికే పలు సినిమాలకు సహాయ దర్శకురాలిగా వర్క్‌ చేసింది. ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించింది. ఈమె హీరోయిన్‌గా మారాలని భావించడంతో నాగార్జున మరియు దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌లు ఈమెను అఖిల్‌తో జత చేయాలని ప్లాన్‌ చేశారు. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు కళ్యాణి కూడా చాలా ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు:

జక్కన్నపై వర్మ ఆ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటో..?

శైలజకు ఇలా కలిసి వస్తుందేంటో..!