జక్కన్నపై వర్మ ఆ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటో..?

Varma Says there Is No Super Director Like Rajmouli In Bollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Varma Says there Is No Super Director Like Rajmouli In Bollywood

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఉన్నది ఉన్నట్లుగా, తన మనస్సులో ఏది అనుకుంటే అదే బయటకు చెప్పేస్తాడు. తానో స్టార్‌ డైరెక్టర్‌ అయినప్పటికి ఇతర దర్శకులతో పోల్చుకుని తక్కువ చేసుకుని వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాజమౌళి విషయాన్ని తీసుకు వచ్చిన ప్రతి సారి ఆయన ముందు తానో పిల్ల కాకి దర్శకుడిని అంటూ చెబుతూ ఉంటాడు. తాజాగా వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో సారి బాహుబలి దర్శకుడు రాజమౌళిపై వర్మ ప్రశంసలు కురిపించాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో రాజమౌళి వంటి గొప్ప దర్శకులు లేరు. అందుకే ‘బాహుబలి’ వంటి అద్బుత చిత్రాలు రావడం లేదు. ఒక సినిమా కోసం అంత సాహసం చేసే దర్శకులు బాలీవుడ్‌లో లేరు అని, రాజమౌళికి మాత్రమే అది సాధ్యం అయ్యిందని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యల వెనుక రాజమౌళిని వర్మ బాలీవుడ్‌కు ఆహ్వానిస్తున్నట్లుగా అనిపిస్తుందని వర్మ సన్నిహితులు అంటున్నారు. ఇక ప్రభాస్‌ కూడా ఒక గొప్ప నటుడు అని, ఒక సినిమా కోసం అన్ని సంవత్సరాలు కేటాయించడం అంటే ఏ నటుడు అంతటి సాహసం చేయడు అని చెప్పుకొచ్చాడు. గతంలో పలు సార్లు వర్మ వీరిద్దరిపై వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బాలీవుడ్‌కు రాజమౌళి వెళ్తే బాగుంటుందని టాలీవుడ్‌ వర్గాల వారు కూడా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

రావణుడొచ్చాడు.

ఫ్యాన్స్‌కు పిచ్చేకిస్తున్న ఎన్టీఆర్‌ జై టీజర్‌