లాలూ ఇంటిపై సిబిఐ దాడులు… నితీష్ గుడ్ బై కొడతాడా?

CBI Raids On Lalu Prasad Yadav

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి మరో కష్టం వచ్చి పడింది. ఓ పాత అవినీతి వ్యవహారంలో తాజాగా ఆయనతో పాటు భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది. అంతటితో ఆగకుండా లాలూకి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపింది. లాలూ రైల్వే మంత్రిగా వున్నప్పుడు రాంచి, పూరి తదితర ప్రాంతాల్లో రైల్వే హోటళ్ళకి సంబంధించిన టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలింది. అందులో లాలూ పాత్ర ఉన్నట్టు కొన్ని ఆధారాలు దొరకడంతో సిబిఐ కేసు దాకా వెళ్ళింది. ఢిల్లీ, పాట్నా, రాంచి, పూరి, గురు గ్రామ్ సహా మొత్తం 12 ప్రాంతాల్లో లాలూ నివాసాలు, ఆఫీసుల్లో సిబిఐ అధికారులు తనిఖీలు జరిపారు.

ఇక 12 ఏళ్ళనాడు రైల్వే శాఖ జరిపిన ఓ లావాదేవీ వ్యవహారం కూడా లాలూ మీదకి వచ్చింది. అప్పట్లో రైల్వే కి చెందిన రెండు హోటళ్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటాలిటీ గ్రూప్ కి బదిలీ చేసినట్టు లాలూ ఆరోపణలు ఎదుర్కొంటుంన్నారు. అందుకు ప్రతిగా సదరు సంస్థ లాలూ కి పాట్నా లో రెండు ఎకరాల విలువైన భూమి అప్పగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుని కూడా సిబిఐ చురుగ్గా పరిశీలిస్తోంది.

లాలూ నివాసం మీద సిబిఐ దాడులతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలెర్ట్ అయ్యారు. ఈ కేసుల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ మేరకు పడే అవకాశం ఉందన్న కోణంలో అధికారులు, కీలక మంత్రులతో చర్చించారు. ఈ మధ్య రాష్ట్రపతి ఎన్నికలు సహా వివిధ అంశాల్లో లాలూ కి భిన్నంగా వ్యవహరిస్తూ బీజేపీ కి సానుకూలంగా నడుస్తున్న నితీష్ మదిలో కొత్త ఆలోచనలు పుడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవినీతి లాలూ, ఆయన కొడుకుల్ని భుజాన మోస్తూ సంకీర్ణ ప్రభుత్వం నడిపే బదులు rjd కి గుడ్ బై కొట్టి కొత్త పొత్తులతో సర్కార్ నడపాలని నితీష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

2019 లో జనసేనదే అధికారమా…ఆ సర్వే లో నిజమెంత?

రోజాది అంతులేని కథేనా..?