అమరావతి భూసేకరణలో కీలక మలుపు .

supreme court reject to Alla Ramakrishna CRDA Land Acquisition petition

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతి భూసేకరణ వ్యవహారం నేడు కీలక మలుపులు తిరిగింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్టే ఇవ్వాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కి చుక్క ఎదురైంది. భూసేకరణపై స్టే ఇవ్వడానికి సుప్రీమ్ కోర్టు నిరాకరించింది. ఇదే అంశం హై కోర్టులో విచారణలో ఉండగా తాము విచారణకు స్వీకరించబోమని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో భూసేకరణలో ఇంకో అడుగు ముందుకు పడినట్టు అయ్యింది.

మరోవైపు అమరావతిలో సారవంతమైన భూములని రక్షించాలంటూ రెండేళ్ల కిందట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించిన కేసులో తీర్పు రిజర్వు లో వుంది. అయితే ఈ పరిస్థితుల్లో కేసు ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని సామాజిక వేత్త శ్రీమన్నారాయణ ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ ఆయన గొంతు ఎత్తారు.

ప్రభుత్వా నికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని సామాజిక వేత్త శ్రీమన్నారాయణ అన్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అమరావతి ని అడ్డుకునే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయమనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యం లోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందన్నారు. ప్రభుత్వం రైతుల అమాయకత్వాన్ని ఒక అస్త్రం గా వాడుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 33వేల ఎకరాలు కాదని 50 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమినే రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. తాము ఏపార్టీకి చెందినవారము కాదని, ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకీ అలాగే రాజధాని కి కూడా వ్యతిరేకం కాదన్నారు. కేవలం మూడు పంటలు పండే సారవంతమైన భూములను నాశనం చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాయలను 70 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సారవంతమైన భూముల ను రక్షించాలనే ఉద్దేశ్యం తో తాము 2సం” క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీ టీ) ఆశ్రయించామని ప్రస్తుతం తీర్పును రిజర్వులో ఉన్నదన్నారు. ఈ పరిస్థితి లో కేస్ ఉపసంహరించుకోవాలని లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపుతామని కొంతమంది బెదిరిస్తున్నారని తెలిపారు. బెదిరింపులకు భయపడేది లేదని, జైలుకు వెళ్లయినా పోరాడతామని హెచ్చరించారు. తమకేదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డా.గాదె కన్నారవు నాయుడు పాల్గొన్నారు.

 మరిన్ని వార్తలు 

MOM…తెలుగు బులెట్ రివ్యూ .

కళ్యాణితో అఖిల్‌ రొమాన్స్‌

నాగ్ మీద జగన్ కన్ను?.