నాగ్ మీద జగన్ కన్ను?.

jagan plans to bring nagarjuna in YSRCP party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మీద జగన్ కన్ను పడింది. జగన్ అంటే దర్శకుడు పూరి జగన్నాథ్ అనుకుని పొరబడేరు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికలకు ముందు దాకా నాగార్జున నిజంగానే జగన్ కి దగ్గరగా మెసిలారు. అంతకుముందు 2009 ఎన్నికల టైం లోను వై.ఎస్ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో కి సంబంధించి కొన్ని క్లియరెన్స్ లు ఇవ్వడంలో ఔదార్యం చూపిన వై.ఎస్ కి నాగ్ ఆ విధంగా కృతజ్ఞత తీర్చుకున్నాడని చెప్పుకునే వాళ్ళు. అందులో నిజమున్నా, లేకున్నా వై.ఎస్, జగన్ లతో నాగార్జున సన్నిహితంగా వున్న మాట నిజం. జగన్ తో పాటు జైలుకెళ్లిన మాట్రిక్స్ ప్రసాద్ ని తన స్నేహితుడని చెప్పుకోడానికి, ఆయన్ని పలకరించడానికి జైలుకి వెళ్ళడానికి నాగ్ ఎన్నడూ వెనకడుగు వేయలేదు. అందుకు కారణం 2014 ఎన్నికల ఫలితాల్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడమే. ఫలితాలు వచ్చాక కూడా నాగ్ ఆశ్చర్యపోయిన విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఆ ఫలితాల తర్వాత నాగ్ వైఖరిలో కొంత మార్పు కనిపించింది. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ హైకమాండ్ ని ప్రసన్నం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేసాడు. జగన్ కి దూరంగా బయటకు తెలిసేట్టు చేసాడు. అయితే లోలోపల ఇద్దరి మధ్య సంబంధాల్లో పెద్దగా ఇబ్బందుల్లేవని చెప్పుకుంటారు.

2019 ఎన్నికలకు సర్వశక్తులు కూడగట్టుకుంటున్న జగన్ నాగార్జున, పీవీపీ, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారిని పార్టీలోకి అధికారికంగా చేర్చుకోడానికి తహతహలాడుతున్నారట. దీనికి ప్రధాన కారణం కమ్మ సామాజిక వర్గం బలంగా వున్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీని ముందుకు నడపడానికి ఆర్ధికంగా, సామాజికంగా బలం ఉండి ప్రజాకర్షణ కలిగిన నాయకుల కోసం జగన్ వెదుకుతున్నారు. నాగార్జున తో పాటు ప్రసాద్, పీవీపీ లాంటి వారిని పార్టీ తరపున ఈ జిల్లాల నుంచి ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించాలని జగన్ ఆలోచనగా ఉందట. అయితే వైసీపీ కన్నేసిన నాగ్ తో పాటు మిగిలిన ఇద్దరు నాయకులు కూడా ఒకప్పుడు జగన్ తో అంటకాగి ఇబ్బందులు పడ్డవారే. ఈ పరిస్థితుల్లో జగన్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో?.

 మరిన్ని వార్తలు 

జగన్ పాదయాత్రకి రెడీ…ప్లీనరీ లో ప్రకటన?

జైలవకుశ కి జైజైలు కొడుతున్న సెలెబ్రిటీలు.

వర్మకు ఓకే చెప్పిన నాగ్‌.. త్వరలో షూటింగ్‌