రావెల మీద డౌట్ పెంచిన మందకృష్ణ.

chandrababu doubts on ravela kishore because of mandakrishna madiga

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Mrps నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా తలపెట్టిన కురుక్షేత్ర సభ కి అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సభ నిర్వహించి తీరతామని మందకృష్ణ మాదిగ ప్రకటించడంతో పోలీసులు సభా స్థలికి ఎవ్వరూ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా జిల్లాల నుంచి తరలివస్తున్న mrps కార్యకర్తల్ని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ చినకాకాని ప్రాంతంలో కొందరు కార్యకర్తలు పొలాల్లో నుంచి వచ్చి కొద్దిసేపు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. మరోవైపు ఈ సభకు ఆర్ధిక సహకారం అందించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు మీద ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఆయన పేరు మీద mrps కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ గుంటూరు లో కొన్ని ఫ్లెక్షీలు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఇప్పటికే రావెల మీద ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ ఫ్లెక్షీల వ్యవహారం ఇంకాస్త వేడి పెంచింది. అటు కురుక్షేత్ర సభకి పిలుపు ఇచ్చిన మందకృష్ణ సైతం టీడీపీ లో ఎస్సీ నేతల్ని తప్పుబట్టారు కానీ రావెల పేరు ప్రస్తావించలేదు.

మందకృష్ణ టెలిఫోన్ ద్వారా తాజా పరిణామాలపై మాట్లాడారు. అదేమిటో ఆయన మాటల్లోనే …”మా సహకారంతో టీడీపీ తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేసుకోవడంతో పాటు, ఏపీలో అధికారం చేపట్టింది

ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా ఉంటామని చెబితే పైసాకు ఆశించకుండా నమ్మాం. మా సహకారంతో గెలిచిన చంద్రబాబు మూడేళ్లుగా వర్గీకరణను మూలన పెట్టారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులకు ఉన్నత పదవులు ఇస్తున్నారు. మా జాతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.మా ఆవేదన చెప్పుకొనేందుకు సభ పెట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటున్నారు.

1994 నుంచి లక్షల మందితో సభలు పెట్టుకున్న సందర్భాల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిన దాఖలాలు లేవు.మాల మహానాడు, మాదిగ దండోరా ఒకేసారి నిర్వహించిన ఘటనలు ఎప్పుడూ లేవు.చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పోలీసులతో అనుమతిని రద్దు చేయించారు.హైకోర్టు మా గత చరిత్ర పరిశీలించి అనుమతివ్వాలని ఆదేశించింది.అయినప్పటికీ అనుమతి రద్దు చేయడంతో పాటు అన్ని జిల్లాలు, రాష్ట్ర సరిహద్దులో వేలాది పోలీసులను మోహరించి అరెస్టులు, లాఠీ చార్జీలు చేస్తున్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే నిర్బంధం చేస్తున్నారు.

మేము అనుమతి కోరిన చోటే గతంలో చంద్రబాబు యువగర్జన, ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు నిర్వహించారు. అదే ప్రాంతంలో చట్టాన్ని, న్యాయాన్ని పాతరేస్తున్నారు. అదే ప్రదేశంలో గతంలో వైఎస్ సమావేశం, మాలమహానాడు, పవన్ కల్యాణ్ చేనేత సమావేశం పెట్టుకున్నారు. ఆవేదనను చూపే అవకాశం కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల్లో ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. అరెస్టులకు భయపడబోం, మాదిగలంతా రోడ్డుపైకి రావాలని పిలుపునిస్తున్నా, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరుతున్నా. కేంద్ర మంత్రి వెంకయ్య సైతం మాదిగల క్రమశిక్షణకు జేజేలు పలికారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించాలనుకుంటున్నాం. మాదిగ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి చంద్రబాబు బెదిరించారు. కురుక్షేత్రానికి వెళ్లొద్దని, వర్గీకరణ గురించి మాట్లాడొద్దని, మాలలతో కలిసి పనిచేయాలని హెచ్చరించారు. వర్గీకరణ చేయబోనని, మాదిగలెక్కడున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది.

మాదిగలే లేనప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నిర్బంధం ఎందుకు పెట్టారు. చంద్రబాబును ఓడించేందుకు తిరిగిన జూపూడి ప్రభాకర్, కారెం శివాజీలకు కార్పొరేషన్ పదవులిచ్చారు. మాదిగ వర్గానికి చెందిన రావెల కిశోర్ బాబును తొలగించి ఆ శాఖను మాలకు చెందిన నక్కా ఆనందబాబుకు ఇచ్చారు. ఎస్సీలకు సంబంధించి ఉన్న మూడు శాఖలను మాలలకే ఇచ్చారు. ఓడించేందుకు తిరిగిన వారికి పదవులు, గెలిచేందుకు సహకరించిన వారికి  సంకెళ్లు వేశారు. ఎక్కడ అరెస్టులు చేశారో అక్కడ ఎదురు తిరిగి రోడ్లను దిగ్బంధనం చేస్తాం. 4వ తేదీ రాత్రి 7.30 నుంచి 9.30 మధ్యలో మాదిగ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను చంద్రబాబు బెదిరించారు. వర్ల రామయ్య, జవహర్ ఏనాడూ మాదిగోద్యమంలో పాల్గొనలేదు. రెండు గంటల్లో చంద్రబాబు ఏం మాట్లాడారో చెప్పాలి. మంత్రి పదవి కోసం జవహర్, రాజ్యసభ సీటిస్తానన్నారని వర్ల మాదిగలకు ద్రోహం చేస్తున్నారు” మందకృష్ణ మాదిగ

 మరిన్ని వార్తలు 

అమరావతి భూసేకరణలో కీలక మలుపు .

లాలూ ఇంటిపై సిబిఐ దాడులు… నితీష్ గుడ్ బై కొడతాడా?

నాగ్ మీద జగన్ కన్ను?.