బోయపాటి కి ఎవరి శాపం ?

boyapati srinu no new movie after Jaya Janaki Nayaka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా రంగంలో సక్సెస్ కి మాత్రమే విలువ అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. చిత్రసీమ పోకడలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కానీ విజయం చేతిలో వున్నా ప్రతిసారి అవకాశం కోసం ఎదురు చూడాల్సిరావడం దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఓ శాపంగా మారింది. ఇప్పుడు విడుదలకి సిద్ధంగా ఉన్న జయ జానకి నాయక సినిమాతో బోయపాటి మొత్తం ఏడు సినిమాలు చేసాడు. 2005 లో ఆయన డైరెక్ట్ చేసిన తొలి సినిమా భద్ర విడుదల అయితే ఇప్పుడు 2017 లో జయ జానకి నాయక సినిమా విడుదల కాబోతోంది. అంటే 12 ఏళ్లలో తీసింది ఏడు అంటే ఏడు సినిమాలు తీసాడు. అలాగని హిట్స్ లేవా అనుకుంటే విడుదల అయిన ఆరు సినిమాల్లో ఒక్క దమ్ము యావరేజ్, మిగిలినవన్నీ పెద్ద హిట్స్. అయినా సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తప్పడం లేదు.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే జయజానకి నాయక తర్వాత బోయపాటి సినిమా ఏంటో ఇంకా నిర్ణయం కాలేదు. మెగా స్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య సహా టాప్ స్టార్స్ చాలా మంది బోయపాటితో సినిమా చేయడానికి ఓకే, కానీ వాళ్లకి ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ చూస్తుంటే ఇప్పట్లో ఎవరితో సినిమా చేసే పరిస్థితి లేదు. చిరు ఉయ్యాలవాడతో బిజీ అవబోతుంటే కె.ఎస్. రవి కుమార్, వర్మ సినిమాలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వున్నారు. ఇక రామ్ చరణ్, మహేష్ బాబు పేర్లు వినిపించినా అది కూడా నిజం కాదని తేలింది. ఈ విధంగా చూసినప్పుడు సక్సెస్ చేతిలో వున్నా సినిమా కోసం వెదుక్కోవాల్సి వస్తున్న బోయపాటికి శాపం లేదంటారా?

 మరిన్ని వార్తలు 

MOM… తెలుగు బులెట్ రివ్యూ .

కళ్యాణితో అఖిల్‌ రొమాన్స్‌

నిన్ను కోరి… తెలుగు బులెట్ రివ్యూ