డ్రగ్స్ క్యాపిటల్ గా హైదరాబాద్

Hyderabad is capital for Drugs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇప్పటిదాకా ఉగ్రమూలాలు ఉన్న నగరంగా పేరున్న హైదరాబాద్ కు కొత్తగా డ్రగ్స్ రాజధాని అనే క్యాప్షన్ తోడైంది. అదేమంటే డ్రగ్స్ ముఠాల్ని ఉక్కుపాదంతో అణచేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది కానీ.. జరిగేది వేరుగా ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే కాదు ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఏకంగా విద్యార్థులు కూడా డ్రగ్స్ ఎఢిక్ట్ లుగా మారడం అందర్నీ కలవరపరుస్తోంది.

టైమ్ పాస్ కోసం కాలేజీలు కొన్నుంటాయి. అలాంటి చోట్ల డ్రగ్స్ ఎడిక్ట్ లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టాప్ టెన్ స్కూళ్లు, కాలేజీల్లో కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోందంటే.. ప్రమాణాలు అంటూ హడావిడి చేసే విద్యాసంస్థల ప్రచారం డొల్లేనని తేలిపోతుంది. దీనికి తోడు సిటీ పోలీస్ ను పవర్ ఫుల్ గా మార్చిన కేసీఆర్ కూడా డ్రగ్స్ ను కంట్రోల్ చేయలేకపోవడంపై మథనపడుతున్నారట.

పోలీసులకు కేసీఆర్ అన్నీ ఇచ్చారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా బడ్జెట్ కూడా భారీగా పెంచారు. ఇంత చేశాక కూడా డ్రగ్స్ రాకెట్ ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్నతాధికారులపై ఫైరయ్యారట. మీ వల్ల సర్కారుకు చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారట. ఒకదాని తర్వాత ఒకటిగా పోలీస్ శాఖ వైఫల్యాలు గులాబీ బాస్ ను ఇరుకునపెడుతున్నారు.

మరిన్ని వార్తలు