మంచి మనస్సు చాటుకున్నాడు

salman khan gave money return to distributors after tubelight movie flop

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమాలో నటించడం, తనపనేంటో తాను చూసుకోవడం హీరోలు చేసే పని. కాని కొందరు హీరోలు మాత్రమే సినిమా విడుదల తర్వాత డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచిస్తారు. స్టార్‌ హీరోల సినిమాలకు నిర్మాతలపై పెద్దగా ప్రభావం పడకున్నా డిస్ట్రిబ్యూటర్లపై పెను ప్రభావం పడుతుంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సినిమా ఆడకుంటే డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా బాలీవుడ్‌లో విడుదలైన ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం 55 కోట్ల నష్టాలను డిస్ట్రిబ్యూటర్లకు మిగిల్చింది. దాంతో వారంత కూడా సల్మాన్‌ ఖాన్‌ను ఆశ్రయించడం జరిగింది. 

‘ట్యూబ్‌లైట్‌’ చిత్రానికి సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించడంతో పాటు నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకున్నాడు. దాంతో సల్మాన్‌ ఖాన్‌ తన ఖాతాలోంచి 55 కోట్లను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ గత చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి. అయితే ఈ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశ పర్చడంతో సల్మాన్‌ ఖాన్‌ వారికి సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా మంచి మనస్సు చేసుకుని 55 కోట్లను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరో కూడా ఇలా డిస్ట్రిబ్యూటర్లను ఇంత భారీ స్థాయిలో ఆదుకున్న దాఖలాలు లేవు. సల్మాన్‌ మాత్రం మంచి మనస్సుతో భారీ సాయంకు ముందుకు వచ్చాడు అంటూ హిందీ మీడియా సల్మాన్‌పై ప్రశంసలు కురిపిస్తుంది.

మరిన్ని వార్తలు

సమంత ఫొటో షూట్‌కు షాక్‌ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్‌

బాలయ్య తమిళ వ్యాఖ్యలపై విమర్శల