చిరు సరసన సోనాక్షి సిన్హా ?

sonakshi sinha as heroine in chiru uyyalawada narasimha reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా భలే ఛాన్స్ కొట్టినట్టు సమాచారం. ఆమెకి మెగా స్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం తలుపు తట్టినట్టు ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ లో హల్ చెల్ చేస్తోంది. మెగా స్టార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లో ఓ హీరోయిన్ గా ఆమెని సంప్రదించినట్టు తెలుస్తోంది. కాస్త బొద్దుగా కనిపించే ఈ భామ అయితే మెగా స్టార్ సరసన బాగుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకుంటున్నట్టు సమాచారం. దాదాపుగా సోనాక్షి ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టే అని తెలుస్తోంది.

అటు ఇంతకుముందు కూడా సోనాక్షి కి రజని సరసన లింగా లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కింది. అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో దక్షిణాదిన ఆమెకి పెద్దగా ఛాన్స్ లు రాలేదు. ఇప్పుడు మెగా స్టార్ సినిమాలో ఛాన్స్ తో సోనాక్షి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ సినిమా హిట్ అయితే సోనాక్షి సౌత్ లో కూడా మంచి డిమాండ్ రావొచ్చు. నిజానికి సోనాక్షి సరసన నటించిన రజని, నటించబోతున్న చిరు…ఇద్దరు కూడా ఆమె తండ్రి శత్రుజ్ఞ సిన్హా స్నేహితులు కావడం విశేషం.

 మరిన్ని వార్తలు 

సమంత ఫొటో షూట్‌కు షాక్‌ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్‌

భావన కేసుతో ఆ హీరోకు సంబంధం ఏంటి?