సమంత ఫొటో షూట్‌కు షాక్‌ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Akkineni Fans Hurt With Samantha Hot PhotoShoot

తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వరుస చిత్రాలు చేస్తున్న ముద్దుగుమ్మ సమంత అక్టోబర్‌లో హీరో నాగచైతన్యను వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం ఇప్పటికే పూర్తి అయ్యింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మూడు నెలల్లో సమంత, నాగచైతన్యల వివాహం జరుగబోతుంది. ఈ సమయంలో సమంత కాస్త పద్దతిగా, హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. టాలీవుడ్‌లో మంచి పేరున్న కుటుంబం అయిన అక్కినేని వారి ఇంటి కోడలుగా ఆమె అడుగు పెట్టబోతుంది. ఈ సమయంలో ఆమె కాస్త పద్దతిగా హుందాగా వ్యవహరించాల్సి ఉంది. 

పెళ్లి కాకముందు అమల ఎలా ఉన్నా కూడా అక్కినేని వారి కోడలు అయిన తర్వాత చాలా పద్దతిగా ఉండటం చూస్తున్నాం. కాని సమంత మాత్రం పెళ్లికి రోజులు దగ్గర పడుతున్నా కూడా ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా అక్కినేని వారి పరువు తీసే విధంగా వ్యవహరిస్తుంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్‌ కోసం అంటూ అత్యంత హాట్‌ ఫొటో షూట్‌ను ఇచ్చింది. సమంత కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి ఫొటో షూట్‌ చూడలేదని కొందరు ఫ్యాన్స్‌ అంటున్నారు. పెళ్లి ఫిక్స్‌ అయిన తర్వాత కాస్త గ్లామర్‌ తగ్గించుకోవాల్సిందిపోయి ఇలా బరితెగించడంపై అక్కినేని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఫొటో షూట్‌పై అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి. సమంత హాట్‌ ఫొటో షూట్‌పై మీరు ఒక లుక్కేయండి.

సమంత ఫొటో షూట్‌కు షాక్‌ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్‌ - Telugu Bullet సమంత ఫొటో షూట్‌కు షాక్‌ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్‌ - Telugu Bullet సమంత ఫొటో షూట్‌కు షాక్‌ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్‌ - Telugu Bullet