వర్మకు పాలాభిషేకంతో విజ్ఞప్తి

Akkineni Fans Palabhishekam To Ram Gopal Varma Cutout

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సినిమా ఎక్కడ ఆడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. వర్మ, నాగ్‌ల కాంబో అనగానే అందరు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని పెట్టుకున్న ఆశల్లో కనీసం 10 శాతం అయినా నెరవేర్చలేక పోయాడు వర్మ. ఆఫీసర్‌ సమయంలోనే వర్మ పలు సందర్బాల్లో తాను అఖిల్‌తో సినిమా చేస్తాను అని, నాగార్జున కూడా ఒప్పేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ విషయంపై నాగార్జున ఇప్పటి వరకు స్పందించలేదు. కాని అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం నాగార్జునకు విజ్ఞప్తి చేస్తూ అఖిల్‌, వర్మల మూవీ వద్దంటున్నారు. సోషల్‌ మీడియాలో వర్మను హెచ్చరిస్తూ నువ్వు కనుక అఖిల్‌ జోలికి వస్తే తన్నులు తింటావు అంటూ హెచ్చరిస్తున్నారు.

వర్మ దర్శకత్వంలో అఖిల్‌ మూవీ ఉండొద్దంటూ ఫ్యాన్స్‌ పూజలు చేస్తున్నారు. తాజాగా స్వయంగా రామ్‌ గోపాల్‌ వర్మ చిత్రపటంకు పాలాభిషేకం చేశారు. సహజంగా అయితే పాలాభిషేకం ఏదైనా గొప్ప పని చేస్తే పాలాభిషేకం చేస్తారు. కాని అఖిల్‌తో సినిమా వద్దంటూ రిక్వెస్ట్‌ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్‌ వర్మ కటౌట్‌కు పాలాభిషేకం చేయడం జరిగింది. వర్మ చేయాలనుకుంటున్న అఖిల్‌ మూవీ గురించి మరిచి పోవాలని , ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోనే ఉండవద్దని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే అఖిల్‌ కెరీర్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఒకవేళ వర్మ సినిమాలో అఖిల్‌ నటిస్తే ఇక నటనకు గుడ్‌బై చెప్పేయాల్సిందే అంటూ ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు. దయచేసి అఖిల్‌తో సినిమా తీయమాకు అంటూ వర్మకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి వర్మ ఈ విజ్ఞప్తులను ఎలా రిసీవ్‌ చేసుకుంటాడు అనేది చూడాలి.