కేసీఆర్ కి హరీష్ హ్యాండ్ ఇస్తున్నాడా ?

Harish Rao Ready to Give Shock to Telangana CM KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొద్దిరోజులుగా కేసీఆర్ కుటుంబానికి.. హరీష్ రావుకు మధ్య అభ్యంతరాలు తలెత్తినట్టు వార్తలు వింటూనే ఉన్నాం. వాటిని ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఅర్ కుటుంబాలు ఖండిస్తూనే ఉన్నాయి. కానీ హరీష్ రావుకు బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ తరువాత కేటీఆర్ కు కాని.. కూతురు కవితకు కాని అంత బలమైన నాయకత్వపు లక్షణాలు లేవు.. కేసీఆర్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించగల వ్యక్తి హరీష్ రావు మాత్రమే. అందుకే ఈ భయంతోనే కేసీఆర్ ఎక్కడ తనను మింగేస్తాడో అని.. తన కొడుకు కేటీఆర్ ప్రభావం హరీశ్ వల్ల ఎప్పుడూ దిగువగానే ఉండటంతో వీటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ హరీష్ రావుకు ప్రాదాన్యత ఇవ్వట్లేదని వార్తలు వచ్చాయి.

ఎప్పుడు కేసీఆర్ – కేటీఆర్ – కవిత ల భజన చేసే నమస్తే తెలంగాణ దినపత్రికలో కూడా కేటీఆర్ కు ఇచ్చిన ప్రాధాన్యం హరీష్ రావుకు ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యవసాయరంగంలో మంచిపేరు రావడానికి కారణం గత నాలుగేళ్లుగా హరీష్ రావు నిర్విరామంగా ప్రాజెక్టుల పూర్తికి శ్రమిస్తుండడమే అని ప్రతిఒక్కరికీ తెలుసు. మాస్ లీడర్ గా మంచి ఇమేజ్ ఉన్న హరీష్ రావు ఎక్కడికయినా వెళతారు ఏ పని అయినా చేస్తారు ఎవరితో అయినా కలిసిపోతారు. గత నాలుగేళ్లలో ఉద్యోగాలు కంటితుడుపుగా కూడలేవని విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టకపోవడం మరింత చెడ్డ పేరు తెచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ ఆర్టీసి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3500 కోట్లు ఇచ్చినా మళ్లీ ఆర్టీసీ జీతాల పెంపుకు నా వద్దకు రావడం ఏంటని ప్రశ్నించారు. రూ.2,800 కోట్ల నష్టాల్లో ఉంటే వేతనాలను పెంచాలని అడుగుతారా అంటూ ఆగ్రహించి బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని, సమ్మె చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ ఘాటుగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఐదు రూపాయల వేతనం కూడా పెంచే పరిస్థితి కార్పొరేషన్‌కు లేదంటూ కరాఖండిగా చెప్పేశారు. ఉద్యోగులతో సన్నిహితంగా ఉండే కేసీఆర్.. ముఖ్యంగా తన పార్టీకి అనుబంధ సంస్థ లాంటి టీఎంయూ విషయంలో ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారో చాలా మందికి అర్థం కాలేదు. ఆర్టీసీ విషయంలో కటినంగా  ఉన్న కేసీఆర్ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై మాత్రం సానుకూలంగా స్పందించారు. టీఎంయూ సంఘానికి గౌరవ అధ్యక్షుడు హరీష్ రావు కావడం మూలంగానే కేసీఆర్ వ్యతిరేకించారని హరీష్ అనుకూల వర్గాలు అనుమానిస్తున్నాయి.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకు ఒప్పుకోకుంటే ఈనెల 11 నుంచి తాము నిరవధిక సమ్మెకు దిగుతున్నామని ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తామని 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని సంఘం అధ్యక్షుడు అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. అశ్వథ్థామరెడ్డి.. నేరుగా కాంగ్రెస్ నేతల్లా.. ముఖ్యమంత్రికే కౌంటర్ ఇస్తున్నారు. . మరి హరీష్ రావు.. ఎందుకు కార్మిక సంఘం నేత ఆశ్వథ్థామరెడ్డికి సర్ది చెప్పడం లేదో అర్ధం కాని అంశం. కేసీఆర్ ఎవరు చెప్పినా వినరని అందుకే ఓ సారి సమ్మెకు వెళ్తే ఏదయినా పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వెనక ఉంది మొత్తానికి హరీష్ రావు కేసిఆర్ కి హ్యాండ్ ఇస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.