రాజీ దేనికి? ఎన్టీఆర్‌పై నింద నిజమా?

puri jagannadh and junior ntr compromise in jai character

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘టెంపర్‌’ చిత్రం సమయంలో ఎన్టీఆర్‌కు దర్శకుడు పూరి జగన్నాధ్‌ తాను అనుకుంటున్న ఒక పాత్ర గురించి చెప్పాడు. ఆ పాత్ర విలనిజంకు ప్రతి రూపంగా ఉంటుంది. ఆ పాత్రను బేస్‌ చేసుకుని కథను సిద్దం చేస్తాను అంటూ పూరి జగన్నాధ్‌ అప్పుడు ఎన్టీఆర్‌తో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ ఆ పాత్రను తాను ప్రస్తుతం నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రం కోసం వినియోగించుకున్నాడు అనేది ఒక ఆంగ్ల పత్రిక యొక్క కథనం. పూరి స్వయంగా తమతో ఆ విషయాన్ని చెప్పాడు అనేది ఆ పత్రిక వారు చెబుతున్న మాట. ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంతా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. 

ఈ సమయంలోనే నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ మరియు చిత్రానికి చెందిన కొందరు స్వయంగా పూరితో మాట్లాడి రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది. రాజీ కుదిర్చారు అంటే ఎన్టీఆర్‌పై పడ్డ ఆ నింద నిజమే అన్నట్లుగా అంతా భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ సదరు ఇంగ్లీష్‌ దినపత్రికలో వచ్చినట్లుగానే పూరి ఐడియాను చోరి చేసినట్లుగా అంతా నమ్ముతున్నారు. పూరి అంతకు మించి గొడవ చేయవద్దనే ఉద్దేశ్యంతో ఇలా రాజీని కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేదని కొందరు అంటుండగా, పూరి పెద్దగా గుర్తు పట్టడులే అని ఎన్టీఆర్‌ ఆ పాత్రను జైగా తీసుకు వచ్చి ఉంటాడు అనేది మరి కొందరి వాదన. మొత్తానికి ఎన్టీఆర్‌ ఐడియాను దొంగిలించాడు అనే నిందను ఎప్పటికి మోయాల్సిందే.

మరిన్ని వార్తలు

దర్శకుడు’ సుకుమార్‌ రియల్‌ లైఫ్‌ స్టోరీ..!