భావన కేసుతో ఆ హీరోకు సంబంధం ఏంటి?

Kerala Actor Dilip Kumar Arrested In Bhavana Harassment Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Kerala Actor Dilip Kumar Arrested In Bhavana Harassment Case

మలయాళి ముద్దుగుమ్మ భావనపై లైగింక వేదింపులు జరిగిన విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొని తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో కారు డ్రైవర్‌ మరియు కొందరు భావనపై లైంగిక వేదింపులు చేశారు. భావనను కిడ్నాప్‌ చేసి కొన్ని గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళ సీఎం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు వెంట వెంటనే నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల విచారణ పూర్తి అయ్యింది. వారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ సమయంలోనే ఒక షాకింగ్‌ విషయం పోలీసులకు తెలిసింది.

భావన లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్‌ అయ్యి రిమాండ్‌లో ఉన్న ఒక వ్యక్తి హీరో దిలీప్‌ కుమార్‌కు ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరంలో మీ పేరు బయటకు చెప్పనందుకు దయచేసి అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అంటూ ఉంది. అయితే ఆ ఉత్తరంను పట్టుకుని దిలీప్‌ కుమార్‌ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. ఆ ఉత్తరంకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అయితే అనుమానం ఉన్న పోలీసులు వారం రోజుల పాటు దిలీప్‌ను విచారించగా, భావన లైంగిక వేదింపుల వెనుక దిలీప్‌ కుమార్‌కు సంబంధం ఉందని వెళ్లడైంది. దాంతో పోలీసులు దిలీప్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లుగా మలయాళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మరిన్ని వార్తాలు:

నాని సినిమాపై కేటీఆర్‌ కామెంట్స్‌

ఎన్టీఆర్ ని దేవా కి కాకుండా చేస్తున్న వర్మ ?