నీళ్లు ఇలా తాగితే మీకు డాక్టర్ అవసరమే రాదు.

hot water good for health

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆరోగ్యం కాపాడుకోడానికి నీళ్లు తాగడం ఎంత అవసరమో ఇప్పుడు చాలా మందికి తెలుసు. అయితే నీళ్లు తాగుతున్నప్పటికీ కొంతమంది ఆరోగ్యం కాపాడుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మేము చెప్పబోయే టిప్స్. నీళ్లు తాగడంలో ఈ మూడు టిప్స్ పాటిస్తే చాలు. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే రాదు. నీళ్లు తాగేటప్పుడు పాటించాల్సిన మూడు మెళకువలు ఇవే…

ఫస్ట్ టిప్ …

నిద్ర లేచిన వెంటనే వీలైనంత త్వరగా ఓ లీటర్ నీరు తాగాలి. ఆ నీరు సాధారణ ఉష్ణోగ్రత లేదా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చల్లటి నీరు తాగకూడదు. ఈ లీటర్ నీళ్లు బ్రష్ చేసే ముందు తాగాలా లేక బ్రష్ చేసుకున్నాకా అని చాలా మందికి సందేహం వస్తుంది. అయితే బ్రష్ చేయకుండా తాగితేనే ఎక్కువ మేలు జరుగుతుంది. బ్రష్ చేయకుండా తాగితే నోటిలోని ఆల్కలైన్ మినరల్స్ పొట్టలోపలికి వెళ్లి విరేచనం సాఫీగా జరగడానికి తోడ్పడుతుంది.

రెండో టిప్ …

టిఫిన్ , భోజనం ఏది తిన్నా ఆ తర్వాత 40 నిమిషాలకు గోరు వెచ్చని లేదా అంతకన్నా కాస్త వేడి ఎక్కువగా వున్న నీరు తాగండి. ఇలా తీసుకున్న నీరు లోపల ఆహారాన్ని సజావుగా జీర్ణం చేస్తుంది. కొన్ని ఆహార పదార్ధాలు కొలెస్ట్రాల్, ఇంకా ఇతర సమస్యలకు దారి తీయకుండా నివారిస్తుంది.

మూడో టిప్…

నీళ్లు ఎప్పుడు తాగుతున్నా హడావిడిగా, నుంచుని తాగకూడదు. కూర్చొని చిన్న చిన్న గుటకలు ద్వారా నీరు తాగాలి. నుంచుని తాగితే అది వాత సమస్యలకి దారి తీసి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

శరీరానికి చాలినంత నీరు తాగడమే కాకుండా, అవి తీసుకునేటప్పుడు ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది రాదు. డాక్టర్ అవసరం రానే రాదు.

 మరిన్ని వార్తలు 

కామసూత్రతో కొత్త పిచ్చి

వైసీపీ లో పీకే టెర్రర్.

ఒంటరిగా ఉన్నప్పుడు గుండె పోటు వస్తే…