నిహారిక ఇలా చేయాల్సిందేనా?

Niharika Konidela has signed her second film

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Niharika Second Movie Launched Today

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిహారిక ‘ఒక మనస్సు’ చిత్రంతో ఆకట్టుకోలేక పోయింది. దాంతో దాదాపు రెండు సంవత్సరాల  గ్యాప్‌ తీసుకుని రెండవ సినిమాకు కమిట్‌ అయ్యింది. నేడు నిహారిక రెండవ సినిమా ప్రారంభం అయ్యింది. నిహారిక రెండవ సినిమాకు రవిదుర్గ ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్‌ క్లాప్‌ కొట్టగా, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. అంతా బాగానే ఉంది కాని, ఈ సినిమాలో హీరో ఉన్నట్లుగా లేడు. అందుకే హీరోయిన్‌పైనే తొలి క్లాప్‌ వేశారు. మెగా హీరోయిన్‌తో నటించేందుకు ఏ యువ హీరో ఆసక్తి చూపడం లేదు, ఒక వేళ నటించినా రొమాంటిక్‌ సీన్స్‌ చేయాలి అంటే కాస్త భయం. అందుకే నిహారికకు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలే దిక్కు అవుతున్నాయి.

తాజాగా నిహారిక సైన్‌ చేసిన సినిమా కూడా ఒక విభిన్న కథాంశంతో కూడుకున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు పెద్దగా మార్కెట్‌ లేదు. ఒక వేళ చేసినా అవి సో సోగానే నడుస్తున్నాయి. తెలుగులో ‘అరుంధతి’ చిత్రం తర్వాత హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ను దక్కించుకున్నది లేదు. కాని తప్పని పరిస్థితుల్లో నిహారికకు వేరే ఛాన్స్‌ లేక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేస్తుంది. మొదటి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన నిహారిక రెండవ సినిమాతో అయిన సక్సెస్‌ను దక్కించుకుంటుందా అంటే అనుమానమే అంటున్నారు. నేడే ప్రారంభం అయిన ఈ సినిమా గురించి అప్పుడే ఒక అంచనాకు రాలేం. సినిమాలో మ్యాటరేంటో తెలిస్తే అప్పుడు ఫలితం ఏంటో తెలుస్తుంది. అందుకే అప్పటి వరకు వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని వార్తలు

కాదలి… తెలుగుబుల్లెట్ రివ్యూ

శమంతకమణి టీజర్ మామూలుగా లేదుగా…