మాస్‌ అనుకుంటే క్లాస్‌ ఇచ్చాడు

Boyapati Srinu Next Movie Title Jaya Janaki Nayka

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Boyapati Srinu Next Movie Title Jaya Janaki Nayka

మాస్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన బోయపాటి శీను ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ‘సరైనోడు’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకున్న బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బెల్లంకొండకు భారీ బ్లాక్‌బస్టర్‌ పడటం ఖాయం అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో మాస్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న బెల్లంకొండ ఈ సినిమాతో ఊరమాస్‌ హీరోగా వెలుగు వెలగడం ఖాయం అని భావిస్తున్న సమయంలో బోయపాటి శ్రీను షాక్‌ ఇచ్చాడు.

ఇప్పటి వరకు ‘దమ్ము’, ‘సరైనోడు’, ‘సింహా’ వంటి పవర్‌ ఫుల్‌ మాస్‌ సినిమాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను ఈసారి తెరకెక్కిస్తున్న సినిమా కాస్త క్లాస్‌గా ఉండేట్లుగా అనిపిస్తుంది. తాజాగా చిత్రానికి టైటిల్‌గా ‘జయ జానకి నాయక’గా ఫిక్స్‌ చేయడం జరిగింది. టైటిల్‌ను చూస్తుంటే సినిమా కాస్త క్లాస్‌ టచ్‌తో ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ టైటిల్‌పై సోషల్‌ మీడియాలో జోకులు పేళుతున్నాయి. బోయపాటి శ్రీను ఇలా క్లాస్‌ సినిమా చేయడం ఏంటా అని అంతా అవాక్కవుతున్నారు. అయితే టైటిల్‌ క్లాస్‌గా ఉన్నంత మాత్రన సినిమా కూడా క్లాస్‌గా ఉంటుందని చెప్పలేం కదా, సినిమా మాస్‌గా ఉంటుందేమో చూడాలని కొందరు అంటున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ రివీల్‌ అయితే తప్ప ఇది క్లాసా లేక మాసా అనే విషయం వెళ్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు :

తిక్కతిక్క వేషాలు వేయమాకు..!

ఇది మరీ ఓవర్‌ గురు