మరోటి తీసుకు రానున్న మహేష్‌

mahesh-babu-lauching-spyder

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mahesh babu lauching spyder  movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలైంది. టీజర్‌ కేవలం ఒక స్పైడర్‌ను చూపించి, మహేష్‌బాబును బ్యాక్‌ నుండి చూపించి కూడా సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్లారు. ఇప్పుడు మరో టీజర్‌ను తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెలలో మరో టీజర్‌ విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ‘స్పైడర్‌’ రెండవ టీజర్‌ కట్‌ చేశారని, చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ టీజర్‌పై చాలా సంతృప్తిగా ఉన్నారని, దర్శకుడు మురుగదాస్‌ ప్రతిభకు అద్దం పట్టేలా ఆ టీజర్‌ ఉందని అంటున్నారు. మహేష్‌బాబు డైలాగ్స్‌తో పాటు, కొన్ని యాక్షన్‌ విజువల్స్‌ను ఆ టీజర్‌లో చూపించనున్నట్లుగా తెలుస్తోంది. 167 ఫ్రేమ్స్‌తో కూడిన ఆ టీజర్‌ను వచ్చే నెలలో ఏ రోజైనా విడుదల చేయవచ్చు. లేదంటే ఆగస్టులో మహేష్‌బాబు పుట్టిన రోజు ఉంది, ఆ సందర్బంగా అయినా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా భారీ గా విడుదల చేయనున్నారు. అందుకోసం మురుగదాస్‌ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నాడు

మరిన్ని వార్తలు

బాబోయ్‌.. నన్ను కాదు అరెస్ట్‌ చేసింది

నిహారిక ఇలా చేయాల్సిందేనా?