నిహారిక ఫోకస్‌ అక్కడే ఎక్కువ?

niharika konidela tamil debut releasing soon,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌లో స్టార్స్‌ కూతుర్లు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణం. కాని తెలుగులో మాత్రం స్టార్స్‌ కూతుర్లు హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడంను కొందరు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఆ వ్యతిరేకతను ఎదిరించి కొందరు హీరోయిన్స్‌గా తమ సత్తా చాటుతాము అంటూ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మంచు లక్ష్మి నటిగా దూసుకు పోతున్న నేపథ్యంలో మెగా వారసురాలు నిహారిక హీరోయిన్‌గా పలు చిత్రాలు చేస్తోంది. రాజశేఖర్‌ కూతురు శివాని కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. తెలుగులో స్టార్స్‌ కూతుర్లు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చినా గ్లామర్‌ పాత్రలు పోషిస్తే ప్రేక్షకులు ఒప్పుకునే అవకాశం కనిపించడం లేదు. అందుకే నిహారిక తమిళంలో తన సత్తా చాటాలని చూస్తుంది.

niharika-konidela-tamil

తెలుగులో నిహారిక ‘ఒక మనసు’ అనే చిత్రంలో నటించింది. నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె కమర్షియల్‌ హీరోయిన్‌గా పనికి రాదని తేల్చి పారేశారు. అందుకే హీరోల సరసన ఆమెను గ్లామర్‌ పాత్రకు ఎవరు అడిగేందుకు సాహసించడం లేదు. తెలుగులో కమర్షియల్‌ పాత్రలు చేయడం కష్టం అని భావించిన నిహారిక తమిళంపై ఫోకస్‌ చేయాలని నిర్ణయించుకుంది. తమిళంలో ఈ అమ్మడు తాజాగా ఒక చిత్రాన్ని చేసింది. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. త్వరలోనే తమిళంలో మరో చిత్రాన్ని చేసేందుకు ఈమె సిద్దం అవుతుంది. ఆ చిత్రంలో కాస్త గ్లామర్‌గా కనిపించాలని నిర్ణయించుకుంది. తన గ్లామర్‌ను తమిళ ఆడియన్స్‌కు చూపించడం ద్వారా కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని భావిస్తుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా తమిళంలో గుర్తింపు దక్కించుకుని, ఆ తర్వాత తెలుగులో కూడా గ్లామర్‌ పాత్రల అవకాశం వస్తే చేయాలనేది నిహారిక ప్లాన్‌గా తెలుస్తోంది.