ప్రభుదేవాతో ప్రేమ లేదు, ఏదో చిరాకులో..!

Nikesha Patel Clarifies About Relationship Prabhu Deva

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌ ‘కొమురం పులి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిఖిషా పటేల్‌ టైం సరిగా లేక ఆ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. పవన్‌ వంటి స్టార్‌తో తెరంగేట్రం చేసినా కూడా అదృష్టం కలిసి రాలేదు. దాంతో నిఖిషా చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా ఆఫర్ల కోసం వెంపర్లాడుతున్న ఈ అమ్మడు ఇటీవల ప్రభుదేవాతో ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నయనతార నుండి విడిపోయిన తర్వాత ప్రభుదేవా ప్రస్తుతం భార్య పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ సమయంలో ఆయన ప్రేమలో నిఖిషా పటేల్‌ పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు కారణం నిఖిషా చేసిన కొన్ని కామెంట్స్‌.

నిఖిషా ఇటీవల ఒక మీడియా సమావేశంలో తాను అత్యంత అభిమానించే వ్యక్తి ప్రభుదేవా అని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేందుకు సైతం సిద్దం అంటూ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలను మీడియా వారు వక్రీకరించి ఇష్టం వచ్చినట్లుగా పుకార్లు షికార్లు చేశారు. నిఖిషాతో ప్రభుదేవా ప్రేమాయణం అంటూ వార్తలు వచ్చాయి. దాంతో నిఖిషా మాట్లాడుతూ మీడియా వారు తనను పదే పదే పెళ్లి గురించి ప్రశ్నిస్తున్న సమయంలో చిరాకు అనిపించి ప్రభుదేవా ఒప్పుకుంటే చేసుకుంటాను అని సమాధానం ఇచ్చాను తప్ప, ప్రభుదేవాతో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు అంటూ చెప్పుకొచ్చింది. నిఖిషా ఇంతగా క్లారిటీ ఇవ్వడంతో మీడియాలో వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడటం ఖాయం. అప్పట్లో నయనతారను పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్దం చేసుకున్న ప్రభుదేవా చివరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో మళ్లీ భార్య వద్దకు వెళ్లి సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నాడు.