సీఎంగారూ అనాలా? బావగారూ అనాలా ?

savitri daughter vijaya chamundeswari about chandrababu naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇటీవల విడుదలైన ‘మహానటి’ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర యూనిట్ ని ఘనంగా సన్మానించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమానికి సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్ తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నమస్కారం సీఎం గారూ అనాలో.. లేక బావగారూ అనాలో నాకు తెలియడం లేదు.

చంద్రబాబు కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలిచే దానినని చెప్పారు. అమ్మ (సావిత్రి) బయోపిక్ చిత్ర యూనిట్‌తో పాటు తననూ గౌరవించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు నేలపై పుట్టిన అమ్మను గౌరవించడం ద్వారా ఇది పుట్టినిల్లు అనిపించుకున్నారు. అమ్మకి ఈ తెలుగు నేలపై కాకపోతే ఎక్కడ గౌరవం ఉంటుంది. అమ్మ పుట్టిన ఊరిలో మమ్మల్ని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే.. నాకు ముఖ్యమంత్రిని చూశాననే ఫీలింగ్ ఉండదు. ఫ్యామిలీ సభ్యుడిగానే అనిపిస్తారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడారామె.