ఎన్టీఆర్‌ సినిమాలో మూడవ ముద్దుగుమ్మ!

kajal agarwal in NTR aravind sametha movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘జైలవకుశ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్‌ ఖచ్చితంగా ఉంటారు. అందుకే ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు తాజాగా తెలుగమ్మాయి ఇషా రెబ్బాను రెండవ హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మంచి కరింగ్‌ను ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా కనిపించబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. 

‘జనతాగ్యారేజ్‌’ చిత్రంలో పక్కా లోకల్‌ అంటూ ఐటెం సాంగ్‌తో ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ మరోసారి ఎన్టీఆర్‌ కోసం ఐటెం సాంగ్‌ను చేసేందుకు సిద్దం అవుతుంది. పక్కా మాస్‌ మసాలా ఐటెం సాంగ్‌తో కాజల్‌ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌, కాజల్‌ది హిట్‌ కాంబినేషన్‌. అందుకే ఈ చిత్రంలో త్రివిక్రమ్‌ను ఐటెం గా కాజల్‌ను దించాలనే నిర్ణయానికి వచ్చారు. రాధా కృష్ణ ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఇక కాజల్‌కు ఐటెం సాంగ్‌ కోసం దాదాపు కోటి రూపాయలను ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత ఆఫర్‌ను ఎవరైనా వదులుకుంటారా, అసలే అవకాశాలు లేని కాజల్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.

ఎన్టీఆర్‌ సినిమాలో మూడవ ముద్దుగుమ్మ! - Telugu Bullet