ప్రభాస్ అభిమానులంతా దురదృష్టవంతులు

ప్రభాస్ అభిమానులంతా దురదృష్టవంతులు

నిజంగా మన టాలీవుడ్ లో ఉన్న హీరోల అభిమానుల అందరిలోనూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పాలి. ప్రభాస్ ఏ ముహూర్తాన బాహుబలి అనే సినిమా మొదలు పెట్టాడో కానీ అతనికి ఎనలేని ఖ్యాతి వచ్చింది.

దానితో పాటు డార్లింగ్ అభిమానులకు కూడా బ్యాడ్ టైం కూడా మొదలయ్యింది అని చెప్పాలి. ఆ తర్వాతి సినిమా నుంచి చేసిన ఏ సినిమాకు కూడా వారికి అభిమానులకు సరైన అప్డేట్ వచ్చింది లేదు. ఇతర హీరోల ఫ్యాన్స్ కాస్త లేట్ అయినా అప్డేట్ అందుకుంటున్నారు కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఆ లేట్ అనే పదం దగ్గరే ఉండిపోయారు.

ఇప్పుడు చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ నుంచి అయినా సరే టైం టు టైం అప్డేట్స్ వస్తాయా అనుకుంటే వారికి తప్ప మిగతా హీరోల అభిమానులు అందరికీ వస్తున్నాయి. దీనితో మళ్ళీ వీరికి బాహుబలి,సాహో రోజులు మళ్ళీ వచ్చేసాయి అని చెప్పక తప్పడం లేదు.