Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద సందడికి సిద్దం అయ్యాడు. రేపటి నుండి ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ షోతో దాదాపు రెండున్నర నెలలు ఎన్టీఆర్ బుల్లి తెరపై సందడి చేయనున్నాడు. రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ షో కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న బిగ్‌బాస్ షో ఎలా ప్రారంభం కాబోతుంది, షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు వారు ఎలా షోలో కనిపించబోతున్నారు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న.
బిగ్‌బాస్ షోను అదిరే రేంజ్లో ఆరంభించేందుకు స్టార్ మా ప్రతినిధులు సిద్దం అయ్యారు. ఈ షోను భారీ ఈవెంట్‌గా ప్రారంభించబోతున్నారు. మొదటి ఎపిసోడ్లో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలను పరిచయం చేయనున్నారు. వారంతా కూడా వారి డాన్స్ ప్రతిభతో ఆకట్టుకోనున్నారు. ఇక అయిదుగురు హీరోయిన్స్‌తో ఎన్టీఆర్ డాన్స్ చేస్తూ షోలో ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయిదు నిమిషాల పాటు ఎన్టీఆర్‌కు చెందిన అయిదు పాటలతో ఒక బ్యూటిఫుల్ మెడలీతో బిగ్‌బాస్ షో ఆరంభం కానుంది. ఆరంభంతోనే అందరి దృష్టిని ఆకర్షించి భారీ టీఆర్పీ రేటింగ్‌ను సాధించానేది స్టార్ మా వారి ప్లాన్‌గా తెలుస్తోంది. మరి స్టార్ మా వారి ప్రయత్నం సఫలం అయ్యేనా చూడాలి.
మరిన్ని వార్తలు: