రూ. 100 కోట్లు దాటిన జైల‌వ‌కుశ క‌లెక్ష‌న్స్

ntr Jai lava kusa movie Collections crossed RS 100 crores,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేసిన జై ల‌వ‌కుశ‌…బాక్సాఫీసు వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. గ‌త గురువారం విడుద‌లైన ఈ చిత్రం రూ. వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. విడుద‌లైన వారానికే ఈ చిత్రం వంద‌కోట్లు వ‌సూలు చేయ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయింది. తొలి మూడు రోజుల్లో రూ.75 కోట్లు వ‌సూలు చేసిన జై ల‌వ‌కుశ త‌ర్వాత నాలుగురోజుల‌కు రూ. వంద కోట్ల క‌లెక్ష‌న్లు దాటేసింది. బెనిఫిట్ షో నుంచే సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో వ‌సూళ్ల ప‌రంగా ఎక్క‌డా వెన‌క‌ప‌డ‌లేదు. ఓవ‌ర్ సీస్ లో కూడా జైల‌వ‌కుశ సంద‌డిచేస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. జై ల‌వ‌కుశ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచింద‌ని, రూ. వంద కోట్ల వ‌సూళ్ల‌ను దాటేసింద‌ని వెల్ల‌డించాడు. సినిమాకు ఘ‌న‌విజ‌యం అందించిన ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. ఎన్టీఆర్ కెరీర్ లో రూ. వంద‌కోట్ల క్ల‌బ్ లో చేరిన మూడో చిత్ర‌మిది. ఇంత‌కు ముందు నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాలు కూడా రూ.వంద కోట్లు వ‌సూలు చేశాయి.