లోతుగా తవ్వుకుంటూ వెళ్లిన స్పైడర్.

Murugadoss touch excellent points in spyder movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రపంచవ్యాప్తంగా మహేష్ అభిమానుల్ని అలరిస్తూ నేడు స్పైడర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే సినిమా బాగుందని రివ్యూలు వస్తున్నాయి. అయితే స్పైడర్ విషయంలో దర్శకుడు మురుగదాస్ అప్లై చేసిన ఓ ఆలోచన సినీ జీవులకి మాత్రమే కాదు , సామాన్య జనానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ ఫార్ములా ఫాలో అయితే సమాజం నిజంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ఏ కమర్షియల్ సినిమాకైనా ఓ హీరో, ఓ విలన్ వుంటారు. హీరో మంచివాడు. విలన్ చెడ్డవాడు. చివరికి విలన్ మీద హీరో గెలుస్తాడు. ఈ ఫార్ములా కొన్ని వందలవేల సినిమాల్లో చూసాం. కానీ ఈ సినిమాలో కూడా అదే ఫార్ములా వుంది. అయితే కాస్త లోతుగా, జనాన్ని ఆలోచింపచేసే విధంగా వుంది. మానవత్వం మూర్తీభవించిన హీరో కన్నా శాడిజం నిండిన విలన్ అలా ఎందుకు తయారు అయ్యాడన్న మూలం మీద మురుగదాస్ దృష్టి పెట్టాడు. ఇండియన్ సినిమాలో ఇలా రూట్స్ లోకి వెళ్లి ప్రాబ్లెమ్ డీల్ చేయడం కొత్తగా అనిపించింది. హీరో కూడా చివరికి విలన్ అలా తయారు కావడానికి దారి తీసిన పరిస్థితుల గురించి సమాజాన్ని హెచ్చరించడం చాలా బాగుంది.

ఇక పెద్ద హీరోల సినిమాల్లో హీరో, హీరోయిన్ ప్రేమకథ కూడా సహజం. అయితే ఆ ప్రేమ ఒక్కోసారి ఆకర్షణలో నుంచి, ఒక్కోసారి కోరికలోనుంచి పుడుతుందన్న పాయింట్ టచ్ చేసే ధైర్యం ఏ కొద్ది మంది దర్శకులకో ఉంటుంది. ఒకవేళ ఆ పాయింట్ ని టచ్ చేసినా హీరో పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ అదే పాయింట్ ని హీరోయిన్ పాయింట్ అఫ్ వ్యూ లో కూడా ఇంత సున్నితంగా చెప్పొచ్చు అని నిరూపించిన దర్శకుడు మురుగదాస్. మొత్తానికి స్పైడర్ తో తాను అనుకున్న సబ్జెక్టు ని పైపైన కాకుండా లోతుగా తవ్వుకుంటూ వెళ్లిన దర్శకుడికి హాట్స్ ఆఫ్.