వారంలో 100 కోట్లు ఖాయం

ntr-jai-lava-kusa-movie-targets-100-crores-in-one-week

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తుంది. మొదటి రోజే దాదాపుగా 30 కోట్లను వసూళ్లు చేసింది. నైజాం ఏరియాలో సెలవుల సీజన్‌ అవ్వడంతో రెండవ రోజు కూడా భారీగానే వసూళ్లు సాధించింది. మూడవ రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఇక ఆదివారం సహజంగానే భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం. మరో వైపు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను నమోదు చేస్తుంది. ఈ వారాంతంలో కలెక్షన్స్‌ మరింత ఎక్కువగా ఉండటం ఖాయం అంటున్నారు.

మరో మూడు రోజుల్లో మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా వచ్చేలోపు ‘జైలవకుశ’ చిత్రం లాభాల్లో పడాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. అనుకున్నట్లుగానే వారం లోపే చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అని ట్రేడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తన నటన విశ్వరూపం చూపించడంతో పాటు, చక్కని ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. నందమూరి బ్రదర్స్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఒక అద్బుతం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటించిన విషయం తెల్సిందే.