జక్కన్న మూవీ కంటే ముందే ‘బిగ్‌బాస్‌ 2’…

NTR want start bigg boss season 2 telugu Before Rajamouli movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘జైలవకుశ’ చిత్రంతో గత సంవత్సరం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న ఎన్టీఆర్‌ ఈ సంవత్సరం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం దసరాకు చిత్రాన్ని సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఇదే సంవత్సరం ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

త్రివిక్రమ్‌ మూవీ పూర్తి చేసి లేదా ఆ చిత్రంతో పాటు బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను ప్రారంభించాలని ఎన్టీఆర్‌ అభిప్రాయ పడుతున్నాడు. ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఒక చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయితే బిగ్‌బాస్‌ చేసేందుకు ఎన్టీఆర్‌కు అవకాశం ఉండదు. అందుకే జక్కన్న సినిమా ప్రారంభంకు ముందే అంటే జూన్‌ లేదా జులైలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను చేయాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్‌ మాటీవీ వారు కూడా అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారని, సీజన్‌ 2కు పార్టిసిపెంట్లను ఎంపిక చేసే పక్రియ ఒక వైపు జరుగుతుందని సమాచారం అందుతుంది. సో సమ్మర్‌ తర్వాత ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.