“గుంటూరు కారం” నుండి ఓహ్ మై బేబీ సాంగ్ రిలీజ్ !

“గుంటూరు కారం” నుండి ఓహ్ మై బేబీ సాంగ్ రిలీజ్ !
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది . ఈ సినిమా రిలీజ్ కి డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ధం మసాలా సాంగ్ ని రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

“గుంటూరు కారం” నుండి ఓహ్ మై బేబీ సాంగ్ రిలీజ్ !
Cinema

ఇప్పుడు మేకర్స్ ఓహ్ మై బేబీ అంటూ సాగే పాటని రిలీజ్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 6:03 గంటలకి పాటను రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.