ఆ ఒక్క డైలాగ్ ఉంటే చాలు.. విజయ్ దేవరకొండకి హిట్టు పడ్డట్టే

ఆ ఒక్క డైలాగ్ ఉంటే చాలు.. విజయ్ దేవరకొండకి హిట్టు పడ్డట్టే
Latest Movie

విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి మూవీ మంచి హిట్ అయింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి మూవీ తో ఫుల్ ఖుష్ అయిపోయారు. సమంత నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని మూవీ ల్లో లాగే సమంత ఈ సినిమాలో కూడా ఒక రేంజ్ లో నటించి అందరిని ఆకట్టుకుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది . శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెర మీదకి ఎక్కి భారీ వసూళ్లనే రాబట్టింది.

ఆ ఒక్క డైలాగ్ ఉంటే చాలు.. విజయ్ దేవరకొండకి హిట్టు పడ్డట్టే
Vijay Devarakonda, Samantha

విజయ్ కి లైగర్ సినిమాతో పెద్ద ఫ్లాప్ వచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ నెక్స్ట్ మూవీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఏదేమైనా సమంతకి విజయ్ దేవరకొండ కి మూవీ మంచి హిట్ ని తీసుకొచ్చింది. మూవీ బృందం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఖుషి లో తన డైలాగు ని ఉద్దేశిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. దానికి ఆనంద్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. ఆ పిల్ల నాది అని అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ డైలాగ్ చెప్తారు. బేబీ మూవీ లో ఆనంద్ దేవరకొండ కూడా ఆ పిల్ల నాది రా అనే డైలాగ్ చెప్తారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో ఈ డైలాగ్ వుంది. ఇలా ఈ డైలాగ్ వున్నా సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి.