అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో ఫైండ్ ఎక్స్ !

oppo launch find x mobile

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ మరోనూతన స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. గత నెలలోనే పారిస్ లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా నేడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 6.42 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే గల ఈ స్మార్ట్‌ఫోన్ ధర మన దేశంలో రూ.59,999 గా నిర్ణయించారు. ఫుల్ స్క్రీన్ తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫీచర్లు :
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
6.42″ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
8 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
16/ 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
25 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
3డీ ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్
3730 ఎంఏహెచ్ బ్యాటరీ