అఖిల్‌ తీరుపై విమర్శలు… నాగ్‌కు ఫిర్యాదు

Rumors of Akhil and Venky Atluri fighting

అక్కినేని అఖిల్‌ రెండు చిత్రాలు చేసినా ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ దక్కలేదు. మొదటి సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వగా రెండవ సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకున్నా కూడా ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్‌ రాలేదు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖిల్‌ మూడవ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌తో ‘తొలిప్రేమ’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న వెంకీ అట్లూరి ప్రస్తుతం అఖిల్‌ కోసం ఒక మంచి క్యూట్‌ లవ్‌ స్టోరీతో సినిమాను చేస్తున్నాడు. అయితే అఖిల్‌ స్క్రిప్ట్‌ వ్యవహారంలో ఇన్వాల్వ్‌ అవ్వడం ప్రస్తుతం వెంకీకి చిరాకుగా అనిపిస్తుందట.

మొదటి నుండి కూడా వెంకీ పనిలో అఖిల్‌ వేలు పెట్టడం, తనకు ఓకే అనుకుంటే షాట్‌ను క్లోజ్‌ చేయడం చేస్తున్నాడట. తాజాగా సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ సీన్స్‌కు సంబంధించిన డైలాగ్స్‌ మరియు షాట్స్‌ను మార్చాల్సిందిగా అఖిల్‌ దర్శకుడు వెంకీకి సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ సీన్స్‌ తాను అనుకున్నట్లుగా తీస్తేనే బాగుంటుందని వెంకీ మొండిగా వ్యవహరించడంతో అఖిల్‌ అర్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో రెండు రోజులుగా షూటింగ్‌కు కూడా హాజరు కావడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంను దర్శకుడు వెంకీ అట్లూరి చివరకు నాగార్జున వద్దకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వెంకీ నిర్ణయాన్ని సమర్థించిన నాగార్జున వెంటనే షూటింగ్‌కు హాజరు కావాల్సిందిగా అఖిల్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. మరి అఖిల్‌ ఈ వ్యవహారంలో ఇంకా ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి. మిస్టర్‌ మజ్ను టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా హీరోయిన్‌గా నటిస్తోంది.