సైఫ్ ని ప్రేమిస్తున్న ప్రియాంక చోప్రా చెల్లి

సైఫ్ ని ప్రేమిస్తున్న ప్రియాంక చోప్రా చెల్లి

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా నేటితో ఆమె 33 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నటి పరంగా ఆమెకు బోలేడు మంది అభిమానుల ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ తను మాత్రం ఓకే ఒక హీరోకు పిచ్చి ఫ్యాన్‌ అని చెబుతున్నారు. అతనెవరో కాదు.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌. అవును.. సైఫ్‌ను అభిమానించడమే కాకుండా అతనిని ప్రేమించే దానిని వెల్లడించారు. కానీ దూరంగా ఉంటూనే ఇవ్వన్ని చేసేదాన్నని, ఎప్పుడూ అతనికి చెప్పలేదని పేర్కొన్నారు. చదవండి: అందుకే సుశాంత్‌తో సినిమా చేయలేదు..

పరిణీతి 2019లో నటించిన ‘జబారియా జోడి’ ప్రమోషన్ కోసం నటుడు సిధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘ది కపిల్ శర్మ షో’కు వచ్చారు. వధువు కుటుంబం నుంచి బలవంతంగా కట్నం కోరే వ్యక్తుకలను అపహరించి పెళ్లిళ్లు జరిపే వ్యాపారాన్ని సిద్ధార్థ్‌ మల్హోత్రా నిర్వహిస్తుంటాడు. అయితే సిద్ధార్త్‌నే కిడ్నాప్‌ చేసి అతనిని బలవంతంగా పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో పరిణీతి నటించారు. ఈ సందర్భంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కపిల్‌ శర్మ.. నిజ జీవితంలో ఒక వ్యక్తిని అపహరించడానికి అవకాశం ఇస్తే తాను ఎవరిని అపహరిస్తానని పరిణీతిని అడిగారు. చదవండి: ఎఫ్‌2′ సినిమాకు కేంద్ర అవార్డు

ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ ప్రశ్న కొంచెం క్లిష్టంగా ఉంది. ఒకరిని కలవడానికి నాకు అవకాశం రాకపోతే, అలాగే నేను అతన్ని కిడ్నాప్ చేయవలసి వస్తే అది ‘సైఫ్ అలీ ఖాన్.’ అది కూడా చాలా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే నేను సైఫ్‌ను చాలా ప్రేమిస్తున్నానని కరీనాకు ఇప్పటికే చెప్పాను. ఆమె దానితో సరే అన్నారు.. నేను అతన్ని ఎత్తుకెళ్లడం నాకు ఇష్టం లేదు. కేవలం దూరం నుంచే ప్రేమిస్తాను’ అని పేర్కొన్నారు. కాగా 2014లో సైఫ్‌తో నటించేందుకు పరిణీతికి చాలా దగ్గర అవకాశం వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు ఫైనల్‌ అవ్వలేదు. ఇక ముందైనా ఇద్దరు కలిసి సినిమాలో నటించే అవకాశం రావాలని ఆశిద్ధాం