ఎన్టీఆర్ నట విశ్వ రూపం కి అభిమానులు ఫిదా

ఎన్టీఆర్-నట-విశ్వ-రూపం-కి

కొమరం భీమ్ అభిమానుల ఎదురు చూపులకు చిత్ర యూనిట్ ముగింపు పలికింది. రామరాజు ఫర్ భీమ్ పేరిట చిత్ర యూనిట్ వీడియో ను విడుదల చేసింది. రామ్ చరణ్ చెప్పిన టైమ్ కి కాకుండా, ముప్పై నిమిషాల లేట్ తో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో ను విడుదల చేసారు.అయితే ఈ వీడియో లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కి, ఎన్టీఆర్ అప్పియరెన్స్ కి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాడు కనబడితే సముద్రాలు తడబడతయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి, వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూ తల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ, నా తమ్ముడు కొండ్రు బెబ్బూలి.. కొమరం భీమ్ అంటూ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో హైలెట్ చేశారు అని చెప్పాలి.ఎన్టీఆర్ నట విశ్వ రూపం కి అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుండగా, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.